Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కస్తూరిబా పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 14, 2026 5:44 PM మహబూబాబాద్ General
కస్తూరిబా పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ - Udayam
మహబూబాబాద్‌లోని కస్తూరిబా పాఠశాలను ఎమ్మెల్యే మురళీ నాయక్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా పాఠశాలకు వెళ్లిన ఆయన విద్యాబోధన, వసతి, తాగునీరు తదితర సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలలోని అంశాలతో పాటు వాటి వెనుక ఉన్న విషయాలను అర్థం చేసుకుంటూ చదవాలని సూచించారు. పదో తరగతి పరీక్షలకు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకుని సిద్ధం కావాలని తెలిపారు.

Comments

G
Loading comments...