వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జిల్లా పెడన తెదేపా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. విజయవాడ నుంచి పెడన వెళ్తుండగా గంగూరు వద్ద ఉయ్యూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆయన కారును ఢీకొట్టింది.
ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైనప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదు. ఘటన అనంతరం ఎమ్మెల్యే తన నివాసానికి వెళ్లిపోయారు.
Comments
Loading comments...

