Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిషన్ భగీరథ నీటిని మళ్లిస్తే చర్యలు

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 2:26 PM ఆసిఫాబాద్General
మిషన్ భగీరథ నీటిని మళ్లిస్తే చర్యలు - Udayam
సిర్పూర్‌(టి) మండలం లోనవెల్లి పంచాయతీ పరిధిలోని కంచర్‌పేట్ శివారులో కొందరు రైతులు మిషన్ భగీరథ పైప్‌లైన్ వాల్వ్ తెరిచి నీటిని పంట పొలాలకు మళ్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ రాములు గ్రామానికి వెళ్లి రైతులను విచారించి కౌన్సెలింగ్ నిర్వహించారు. మిషన్ భగీరథ నీటిని అక్రమంగా మళ్లిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...