Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం సర్వజన ఆస్పత్రిని తనిఖీ చేసిన మంత్రి తుమ్మల

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jun 25, 2026 7:05 PM ఖమ్మంGeneral
ఖమ్మం సర్వజన ఆస్పత్రిని తనిఖీ చేసిన మంత్రి తుమ్మల - Udayam
ఖమ్మం సర్వజన ఆస్పత్రిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ విభాగం, క్యాజువాలిటీలలో వైద్య సేవల నాణ్యతను, రోగులకు అందుతున్న మందుల పంపిణీని ఆయన స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించిన మంత్రి, అత్యవసర బ్లాక్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...