వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా గూడూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫొటో లేకపోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు మంత్రుల ఫొటోలు అందులో ఉన్నాయి.
సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ ఘటన చర్చనీయాంశమైంది. ఫ్లెక్సీని ఎవరు రూపొందించారో తెలియదని డీటీ తెలిపారు.
Comments
Loading comments...

