Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరదలతో దెబ్బతిన్న రహదారిని పరిశీలించిన మంత్రి

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 01, 2026 2:51 PM జగిత్యాలGeneral
వరదలతో దెబ్బతిన్న రహదారిని పరిశీలించిన మంత్రి - Udayam
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని తుమ్మేనాల–నర్సయ్యపల్లె మధ్య వరదలకు దెబ్బతిన్న రహదారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. రహదారి దెబ్బతినడంతో నిలిచిన రాకపోకలకు తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శాశ్వత మరమ్మతు పనులను వేగంగా చేపట్టాలని, దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, కల్వర్టులపై నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...