వార్తలకు తిరిగి వెళ్లండి
కడియం శ్రీహరి తీరుపై స్పందించిన కొండా సురేఖ

ఎమ్మెల్యే కడియం శ్రీహరితో ఉన్న విభేదాలపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను ఈనెల 14న కలవనున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. తమ వివాదాన్ని పరిష్కరించుకోవడం కడియంకు ఇష్టం లేదని ఆరోపించారు.
అధికారులపై కడియం ఒత్తిడి తెస్తున్నారని, ఈ అంశంపై సీఎం రేవంత్, పీసీసీ చీఫ్‌లకు ఇప్పటికే ఫిర్యాదు చేశానన్నారు. అయోధ్య విరాళాలను దోచుకున్న వారిని ఆ శ్రీరాముడే శిక్షిస్తాడని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...