వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో విద్యుత్ ఛార్జీలపై మంత్రి గొట్టిపాటి రవి కీలక ప్రకటన చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తొమ్మిదిసార్లు ఛార్జీలు పెంచారని విమర్శిస్తూ, తమ ప్రభుత్వం ఇప్పటికే యూనిట్‌కు 13 పైసలు తగ్గించినట్లు గుర్తుచేశారు. నేతన్నలకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని, రూ.15,790 కోట్ల విద్యుత్ లోటును ప్రభుత్వం భరిస్తోందని స్పష్టం చేశారు.
వచ్చే మూడేళ్ల వరకు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

