Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇక రేషన్ షాపులు కాదు.. ‘మినీ మార్టులు’

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 14, 2026 10:34 AM అమరావతిGeneral
ఇక రేషన్ షాపులు కాదు.. ‘మినీ మార్టులు’ - Udayam
రాష్ట్రంలోని 29,794 రేషన్ షాపులను మినీ మార్టులుగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్ట్ కింద కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో ఎంపిక చేసిన 533 షాపులను మినీ మార్టులుగా అభివృద్ధి చేయనున్నారు. కనీసం 200 చదరపు అడుగుల స్థలం ఉన్న షాపుల్లో అన్ని రకాల నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకే అందుబాటులోకి తెస్తారు. గుంటూరు జిల్లాలో ఈ నెలలోనే తొలి 10 మార్టులను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు.

Comments

G
Loading comments...