వార్తలకు తిరిగి వెళ్లండి
ఈ నెల నుంచే మినీ మార్టులు ప్రారంభం

రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని రేషన్ షాపులను మినీ మార్టులుగా మార్చేందుకు కసరత్తు వేగవంతం చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద గుంటూరు జిల్లాలో ఈ నెలలోనే 10 మినీ మార్టులను ప్రారంభించనుంది.
తొలిదశలో 4 జిల్లాల్లో 533 షాపులను మార్చనుండగా, ఇది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. వీటిలో నిత్యావసరాలు తక్కువ ధరకే లభించనున్నాయి.
Comments
Loading comments...