వార్తలకు తిరిగి వెళ్లండి
రోడ్డుపాలైన అంగన్‌వాడీ లబ్ధిదారుల పాలు

అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేయాల్సిన ఆరోగ్యలక్ష్మి పథకం విజయ డెయిరీ టెట్రాప్యాక్ పాలు రోడ్డుపాలయ్యాయి. ఎనుమాముల - కొత్తపేట రోడ్డు మార్గంలో సుమారు 10 వేలకు పైగా ఖాళీ టెట్రాప్యాక్ డబ్బాలు కుప్పలుగా కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.
లబ్ధిదారులకు చేరాల్సిన పాలు గడువు దాటిపోవడమో లేదా పక్కదారి పట్టడమో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పంపిణీ వ్యవస్థ లోపాలపై జిల్లా సంక్షేమ అధికారి స్పందించలేదు.
Comments
Loading comments...