వార్తలకు తిరిగి వెళ్లండి

అయిజ పట్టణంలో బుధవారం మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం మత పెద్దలు, యువకులు పలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా అందరూ స్నేహ, సోదరభావంతో మెలగాలని ప్రార్థించారు.
సమృద్ధిగా వర్షాలు కురవాలని అల్లాహ్‌ను ప్రార్థించారు. అనంతరం పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు.
Comments
Loading comments...

