Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్ధరాత్రి సోషల్ మీడియా బంద్

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 15, 2026 8:48 AM జాతీయంGeneral
అర్ధరాత్రి సోషల్ మీడియా బంద్ - Udayam
పిల్లలు, టీనేజర్ల మానసిక ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సోషల్ మీడియా యాప్స్ వాడకుండా డిఫాల్ట్ పరిమితులు విధించనుంది. ఈ మేరకు కొత్త నిబంధనలను తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. టీనేజర్లు సామాజిక మాధ్యమాలకు బానిస కాకుండా నిరోధించేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని వెల్లడించింది.

Comments

G
Loading comments...