Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్షంలోకి భారత సంతతి వ్యోమగామి మేనన్

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 15, 2026 7:39 AM జాతీయంGeneral
అంతరిక్షంలోకి భారత సంతతి వ్యోమగామి మేనన్ - Udayam
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి అనిల్ మేనన్ తొలిసారిగా రోదసిలోకి పయనమయ్యారు. రష్యాకు చెందిన సోయజ్ ఎంఎస్-29 వ్యోమనౌక ద్వారా రష్యన్ వ్యోమగాములతో కలిసి కజకిస్థాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) బయలుదేరారు. వీరు ఐఎస్‌ఎస్‌లో 8 నెలల పాటు ఉండి పలు పరిశోధనలు నిర్వహించనున్నారు. నాసా అధిపతి జేర్డ్ ఇజాక్‌మన్, అనిల్ మేనన్ భార్య అన్నా విల్హెమ్ (వ్యోమగామి) కాస్మోడ్రోమ్‌ వద్ద వారికి వీడ్కోలు పలికారు.

Comments

G
Loading comments...