Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు

Follow Udayam on Google
Sircilla jilla news Aug 31, 2026 11:39 PM రాజన్న సిరిసిల్లGeneral
మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు - Udayam
సిరిసిల్ల బీవైనగర్‌లో మహిళలకు ఇంటివద్దే ఉపాధి కల్పించేలా కుటీర పరిశ్రమ ఏర్పాటు చేయడం అభినందనీయమని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు అన్నారు. సోమవారం చర్చిలో పాస్టర్ జాన్ హైజగ్ ఆధ్వర్యంలో దీపాల వత్తుల తయారీ మిషన్‌ను ప్రారంభించారు. వత్తుల తయారీతో మహిళలు రోజుకు రూ.500 నుంచి రూ.1,000 వరకు సంపాదించవచ్చన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉపాధి పొందే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...