వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం: జిల్లా బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ విభాగంలో మహిళా ఉద్యోగులపై వేధింపుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ఏఐఎస్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతలయ్య డిమాండ్ చేస్తూ ఆర్డీఓ రాంభూపాల్ కు వినతిపత్రం అందజేశారు.
బీసీ సంక్షేమ శాఖ డీడీ రాజేంద్రకుమార్ రెడ్డి మహిళా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని కోరారు. ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

