వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం వెంకట వరదరాజపురం గ్రామంలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన వజ్జ రజని గురువారం రాత్రి రెండు చేతుల్లో పాలు క్యాన్లతో నడుచుకుంటూ వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని బంగారు చైన్‌ను లాక్కెళ్లారు.
పుస్తుల తాడును తెంపే ప్రయత్నంలో పుస్తుల అక్కడే ఉండిపోయినా, చైన్‌ను అపహరించి హైవే వైపు పరారయ్యారు. ఘటనపై మందస ఎస్సై కే కృష్ణ ప్రసాద్ దర్యాప్తు చేపడుతున్నారు.
Comments
Loading comments...

