Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు

Follow Udayam on Google
sreekanth patel Aug 18, 2026 1:45 PM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు - Udayam
మైనర్ల డ్రైవింగ్, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, అధిక శబ్దంపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఉల్లంఘించిన వాహనాలపై జరిమానాలు విధించారు. మైనర్ల తల్లిదండ్రులను పిలిపించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె.రాజేందర్ రెడ్డి సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...