Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో అమెరికా స్థాయి విజ్ఞాన కేంద్రం

Follow Udayam on Google
sreekanth patel Sep 22, 2026 10:00 AM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌లో అమెరికా స్థాయి విజ్ఞాన కేంద్రం - Udayam
మహబూబ్‌నగర్‌లో నిర్మిస్తున్న ఫూలే–అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అమెరికా పర్యటనలో గ్విన్నెట్, ఫుల్టన్ కౌంటీ లైబ్రరీలను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. డిజిటల్, కంప్యూటర్ ల్యాబ్‌లు, పోటీ పరీక్షల మెటీరియల్, హైస్పీడ్ ఇంటర్నెట్ వంటి సదుపాయాలతో విజ్ఞాన కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

Comments

G
Loading comments...