Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ మార్కెట్లో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 10:01 AM మహబూబాబాద్ General
మహబూబాబాద్ మార్కెట్లో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు - Udayam
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో బుధవారం నుంచి కొత్త పత్తి కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు మార్కెట్ ఛైర్మన్ సుధాకర్ తెలిపారు. పత్తిని పూర్తిగా ఆరబెట్టి, తేమ లేకుండా బస్తాల్లో నింపాలని సూచించారు. ఆకులు కలిసిన, పక్వానికి రాని పత్తిని నాణ్యమైన పత్తి నుంచి వేరు చేసి గ్రేడింగ్ చేయాలన్నారు. నాణ్యమైన పత్తిని మార్కెట్‌కు తీసుకొస్తే మంచి ధర పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...