వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ రద్దు చేయాలనే కుట్రలను వ్యతిరేకిస్తూ, ఈ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల పెళ్లికి అండగా నిలిచిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించడంతో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

