మెటా కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్

జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్‌భానుచిబ్, ఇన్‌చార్జి మణిశర్మ సోషల్ మీడియా ఖాతాల నిలిపివేతకు నిరసనగా హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని మెటా కార్యాలయాన్ని యువజన కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేపట్టి నినాదాలు చేశారు.
నిలిపివేసిన ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని శివచరణ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
