Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మెట్ పల్లి లో అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 12 మందికి స్వల్ప గాయాలు

nerella Srinivas Jul 28, 2026 8:22 AM జగిత్యాలతెలంగాణ
మెట్ పల్లి లో అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 12 మందికి స్వల్ప గాయాలు - Udayam Digital
జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి.​తెల్లవారుజాము కావడంతో ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...