వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం రూరల్: గార మండలం అంబళ్లవలస ప్రాధమిక పాఠశాలలో మద్యం సేవించి విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయుడిని వెంటనే బదిలీ చేయాలని కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ విషయమై ఎంఈఓ, డీఈఓలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, తక్షణమే బదిలీ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
