వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న స్థానిక ఎన్నికల కోసం మడకశిర నగర పంచాయతీలో 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో 20 వార్డులు ఉండగా, వాటిని 23కు పునర్విభజించారు. మొత్తం 17,337 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
వారిలో 8,416 మంది మహిళలు, 8,910 మంది పురుషులు, ఒక ట్రాన్స్‌జెండర్ ఓటరు ఉన్నారు. వార్డుల పునర్విభజనలో సమీప వార్డులకు బదులుగా ఇతర వార్డులకు మార్చడంపై పలువురు ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

