వార్తలకు తిరిగి వెళ్లండి

మడ్డువలస ఎస్జీఎస్ఎన్ రిజర్వాయర్కు వరద ప్రవాహం గణనీయంగా పెరుగుతోంది. గురువారం సువర్ణముఖి వేగావతి నదులతో 1293 క్యూసెక్కుల నీరు ఇన్స్లో వచ్చిందని ఈఈ గోవిందరావు తెలిపారు. దీంతో రిజర్వాయర్ లో నీటిమట్టం 61.90 మీటర్లకు చేరింది.
కుడి కాలువ ద్వారా 700, ఎడమ కాలువ ద్వారా 10 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇలాగే ఉంటే 24,700 ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

