వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండల కేంద్ర శివారులోని డీర్ పార్క్ వద్ద మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. కవ్వాల్ అభయారణ్యానికి ప్రధాన కేంద్రంగా ఉన్న జన్నారంలో అటవీశాఖ ఆధ్వర్యంలో పలు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. దూర ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులు మొదట జింకల పార్కును సందర్శిస్తారు.
అయితే జింకల పార్క్ వద్ద షెడ్, తాగునీరు, మరుగుదొడ్లు, గైడ్, తదితర సౌకర్యాలు లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Loading comments...

