Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌పై తెగిపడిన విద్యుత్ తీగలు

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 8:25 AM హైదరాబాద్General
ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌పై తెగిపడిన విద్యుత్ తీగలు - Udayam
విజయవాడ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై విద్యుత్ తీగలు తెగిపడటంతో మౌలాలి వద్ద తీవ్ర కలకలం రేగింది. లోకోపైలట్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ శబ్దాలతో భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు దిగి పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది విద్యుత్ తీగలను పునరుద్ధరించిన అనంతరం, అదే రైలులో ప్రయాణికులను సురక్షితంగా సికింద్రాబాద్‌కు తరలించారు.

Comments

G
Loading comments...