వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లా సీఎస్‌పురం మండలం డీజీపేటలో ఈనెల 13న వృద్ధురాలు వెంకట సుబ్బమ్మ (83) హత్య కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పొలానికి వెళ్లిన ఆమెను హత్య చేసి మెడలోని బంగారం ఎత్తుకెళ్లారు.
అదే గ్రామంలో 2024లో రత్తమ్మ అనే వృద్ధురాలు కూడా ఇదే తరహాలో హత్యకు గురైంది. అదుపులో ఉన్న వ్యక్తే బంగారం కోసం ఈ రెండు హత్యలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని సమాచారం.
Comments
Loading comments...

