వార్తలకు తిరిగి వెళ్లండి
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం శివారులో గురువారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఫైర్ స్టేషన్ సమీపంలోని రహదారిపై భారీ గుంతలను తప్పించబోయి డ్రైవర్ బస్సును పక్కకు మళ్లించడంతో అది రోడ్డు పక్కకు ఒరిగింది.
అయితే, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నియంత్రించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

