వార్తలకు తిరిగి వెళ్లండి
మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్.

అల్వాల్‌లో 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై క్యాబ్ డ్రైవర్ కృష్ణ (30)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొంపల్లిలో నివాసముంటూ ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న నిందితుడు మాయమాటలతో బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...