వార్తలకు తిరిగి వెళ్లండి
మహీంద్రా ప్లాంట్ సరికొత్త రికార్డు

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ మహారాష్ట్రలోని తమ చకన్ ప్లాంట్ నుండి 30 లక్షల వాహనాల ఉత్పత్తి మైలురాయిని అధిగమించింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్లాంట్ నుండి సరికొత్త బీఈ 6 ఎలక్ట్రిక్ వాహనాన్ని కంపెనీ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసింది.
అత్యాధునిక సదుపాయాలున్న ఈ ప్లాంట్‌లో ప్యాసింజర్ కార్లతో పాటు కమర్షియల్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మొత్తం 19 మోడళ్లను విజయవంతంగా తయారు చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
Comments
Loading comments...