Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మావోయిస్టు నేత ఆజాద్ జైలు నుంచి విడుదల

Follow Udayam on Google
K Anuradha Aug 19, 2026 11:01 AM శ్రీకాకుళంGeneral
మావోయిస్టు నేత ఆజాద్ జైలు నుంచి విడుదల - Udayam
మందస మండలం నల్లబొడ్లూరుకు చెందిన మాజీ మావోయిస్టు నేత దున్న కేశవరావు అలియాస్ ఆజాద్ భువనేశ్వర్ జర్పడ జైలు నుంచి మంగళవారం విడుదలయ్యారు. 2011లో లొంగిపోయిన ఆయనను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో 16, ఒడిశాలో 52 కేసులు కలిపి మొత్తం 68 కేసుల్లో విచారణ ఎదుర్కొన్న ఆజాద్‌ను న్యాయస్థానాలు నిర్దోషిగా ప్రకటించాయి. 15 ఏళ్ల జైలు జీవితం అనంతరం ఆయన స్వేచ్ఛను పొందారు. బుధవారం స్వగ్రామానికి చేరనున్నారు.

Comments

G
Loading comments...