వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ పవన్ కళ్యాణ్ మామ్మియూర్ మహాదేవ ఆలయాన్ని దర్శించారు. పరమశివుడికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పార్వతీపరమేశ్వరులతో పాటు శ్రీ మహావిష్ణువు, వినాయకుడు, అయ్యప్ప, భగవతి అమ్మవారు, నాగదేవతలకు పూజలు చేశారు.
ఆలయ గోడలపై ఉన్న చిత్రకళా విశేషాలను అడిగి తెలుసుకున్నారు. గురువాయూర్ శ్రీకృష్ణుడి దర్శనం అనంతరం మామ్మియూర్ మహాదేవుడిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
Comments
Loading comments...

