వార్తలకు తిరిగి వెళ్లండి

అంబాజీపేట మండలం మాచవరంలో మరోసారి గ్యాస్ లీక్ కలకలం రేపింది. ఈ నెల 26న పంటపొలాల్లో లీకైన ప్రాంతంలోనే గురువారం రాత్రి నుంచి మళ్లీ గ్యాస్ వెలువడుతోంది. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
సమాచారం అందుకున్న ఓఎన్జీసీ సాంకేతిక నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టింది. ఎలాంటి ప్రమాదం లేదని, స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు తెలిపారు.
Comments
Loading comments...

