Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరులో ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకు బియ్యం

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 31, 2026 2:24 PM ఏలూరుGeneral
ఏలూరులో ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకు బియ్యం - Udayam
జిల్లాలో ఆగస్టు 1 నుంచి ప్రత్యేక కేంద్రాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు విక్రయించనున్నట్లు జేసీ అభిషేక్ గౌడ తెలిపారు. ఏలూరు, కైకలూరు, నూజివీడు రైతు బజార్లతో పాటు మరో మూడు కేంద్రాల్లో విక్రయాలు చేపట్టనున్నారు. BPT స్టీమ్ బియ్యం కిలో రూ.52, రా బియ్యం కిలో రూ.50 చొప్పున అందించనున్నట్లు తెలిపారు. బియ్యం కార్డు ఉన్న వారు ఆధార్‌తో గరిష్ఠంగా 26 కిలోలు పొందవచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...