వార్తలకు తిరిగి వెళ్లండి
ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే బియ్యం విక్రయాలు: పవన్

సామాన్యులకు ఊరట కల్పించేలా ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే బియ్యం విక్రయాలు ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ రూ.52లకు, గ్రేడ్-1 పచ్చి బియ్యం రూ.50లకు రాష్ట్రంలోని 130 రైతుబజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. ధరల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Comments
Loading comments...