వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక విగ్రహాల నిమజ్జనానికి లోతైన ప్రాంతాలకు వెళ్ళవద్దని జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో అధికారులు, పోలీసులు సూచించిన ప్రాంతాలలోనే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు.
వాగులు, వంకలు, నదులు లోతుగా ఉండే ప్రాంతాలకు వెళ్లవద్దని కోరారు.నిమజ్జన సమయంలో చిన్నారులను వెంట తీసుకు వెళ్ళవద్దని, విద్యుత్ వైర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు.
Comments
Loading comments...

