Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భాగస్వామ్య దేశాలకు ₹17,550 కోట్ల రుణ సాయం

రవళి దేవి Jul 23, 2026 8:50 PM అల్ ఇండియా about 1 hour ago
భాగస్వామ్య దేశాలకు ₹17,550 కోట్ల రుణ సాయం - Udayam Digital
గ్లోబల్ సౌత్ దేశాలతో సంబంధాల బలోపేతానికి భారత్ గత ఏడాదిలో భాగస్వామ్య దేశాలకు రూ.17,550 కోట్ల విలువైన ఆరు అభివృద్ధి రుణాల (LoC)కు ఆమోదం తెలిపింది. మౌలిక వసతులు, కనెక్టివిటీ, గృహాలు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాలకు ఈ నిధులు వినియోగించనున్నారు. అలాగే రూ.4,500 కోట్లతో 60 గ్రాంట్ ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చినట్లు విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో వెల్లడించారు.

Comments

G
Loading comments...