Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీ గణపతి రూపంలో సిద్ధి వినాయకుడు

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 10:26 AM సంగారెడ్డిGeneral
లక్ష్మీ గణపతి రూపంలో సిద్ధి వినాయకుడు - Udayam
పటాన్‌చెరు మండలం రుద్రారం శివారులోని గణేష్‌గడ్డ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం 9వ రోజు శ్రీ సిద్ధి వినాయక స్వామి లక్ష్మీ గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు పంచామృతాలు, గంగాజలంతో అభిషేకం నిర్వహించి, సుగంధ పుష్పాలతో అలంకరించారు. మంగళహారతి, నైవేద్యం సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...