Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేటలో ఇంట్లో చోరీ.. నగదు, బంగారం అపహరణ

Follow Udayam on Google
p.g.murthy Sep 08, 2026 8:04 PM మంచిర్యాలGeneral
లక్షెట్టిపేటలో ఇంట్లో చోరీ.. నగదు, బంగారం అపహరణ - Udayam
లక్షెట్టిపేటలోని ఆంధ్రాబోర్ లో ఉన్న ఒక ఇంట్లో దొంగతనం జరిగిందని ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ఇంటి యజమానులు ఆరున ఇంటికి తాళం వేసి పని నిమిత్తం హాజీపూర్ వెళ్లారని, మంగళవారం ఉదయం ఇంటి తలుపులు పగలగొట్టి తెరిచి ఉండడాన్ని స్థానికులు గమనించి వారికి సమాచారం ఇచ్చారన్నారు. యజమానులు వచ్చి దొంగతనం జరిగిందని నిర్ధారించుకుని బీరువాలోని రూ. 12000 నగదు, పావు తులం బంగారం రింగ్ చోరీ అయినట్లు ఫిర్యాదు చేశారన్నారు.

Comments

G
Loading comments...