వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి తాగునీటి పనులు చేపట్టినా, నీరు వృథాగా పోతోందని దిగువపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్నపల్లి నుంచి కొత్తగా వస్తున్న మినరల్ వాటర్ బుధవారం ఉదయం ట్యాంక్ నుంచి పొంగి బయటకు వచ్చి వృథాగా పారింది.
మరోవైపు సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాలువలకు నీరు విడుదల చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు.
Comments
Loading comments...

