వార్తలకు తిరిగి వెళ్లండి

దత్తిరాజేరు మండలం కోమటిపల్లి పెట్రోల్ బంకు సమీపంలో సమగ్ర మంచినీటి పథకం పైపులైన్ లీకేజీ ఏర్పడింది. దీంతో తాగునీరు వృథాగా పోవడంతో పాటు రహదారిపై నీరు చేరి చిత్తడిగా మారింది.
మూడు నెలలుగా సమస్య కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లీకేజీని అరికట్టి రహదారిని సరిచేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

