వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ తెలంగాణ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా బాపట్ల, ప్రకాశం, అనంతపురం, కడప, చిత్తూరు, విశాఖపట్నం, తిరుపతి సహా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, కూలీలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

