Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాప హత్యాచారంలో జీవిత ఖైదు

సాయి తేజ Jul 11, 2026 7:12 AM తిరుపతి 5 viewsabout 1 hour ago
పాప హత్యాచారంలో జీవిత ఖైదు - Udayam Digital
తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో నిందితుడు పాముల నాగరాజుకు కోర్టు జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు పోక్సో కోర్టు న్యాయమూర్తి అరుణసారిక ఆదేశాలు ఇచ్చారు. నేరం రుజువు కావడంతో శిక్షతో పాటు నిందితుడికి జరిమానా విధించారు. అలాగే బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేయాలని తిరుపతి కలెక్టర్‌ను న్యాయస్థానం ఆదేశించింది.

Comments

G
Loading comments...