Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరుత వేటగాళ్ల ముఠా అరెస్ట్

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 13, 2026 12:33 PM నిజామాబాద్General
చిరుత వేటగాళ్ల ముఠా అరెస్ట్ - Udayam
నిజామాబాద్ జిల్లాలోని భీంగల్, ఇందల్ వాయి అటవీ ప్రాంతాలలో రెండు చిరుతల కళేబరాలు లభ్యమయ్యాయి. చర్మం, గోళ్ల కోసం చిరుత పులులను వేటాడుతున్న ముఠాను ధర్పల్లి, భీంగల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేటగాళ్ల ముఠాను విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణకు భద్రతను మరింత కఠినతరం చేసినట్లు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...