Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కష్టకాలంలో సత్యసాయి వెన్నంటే నడిపించారు

Follow Udayam on Google
Rohit Sardana Jun 08, 2026 5:47 PM అనంతపురంGeneral
కష్టకాలంలో సత్యసాయి వెన్నంటే నడిపించారు - Udayam
తన కష్టకాలంలో సత్యసాయిబాబా వెన్నంటే ఉండి నడిపించారని వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్‌ గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సాయికుల్వంత్‌ మందిరంలో బాబా మహాసమాధిని ఆమె ప్రత్యేకంగా దర్శించుకుని, భజనలు మరియు ధ్యానం చేశారు. అనంతరం సత్యసాయి విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన ఆమె, అక్కడ అందిస్తున్న విద్యా విధానాన్ని అభినందించి దీనిని విశ్వవ్యాప్తంగా అమలు చేయాలన్నారు. సత్యసాయి మేనేజింగ్‌ ట్రస్ట్‌ సభ్యులు ఆర్‌జే రత్నాకర్‌ ఆమెకు బాబా చిత్రపటాన్ని అందజేసి సత్కరించిన అనంతరం ఆమె ప్రత్యేక విమానంలో తిరుగుపయనమయ్యారు.

Comments

G
Loading comments...