Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మళ్లీ ఒరాకిల్‌లో లేఆఫ్‌లు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 12, 2026 8:21 AM జాతీయంబిజినెస్
మళ్లీ ఒరాకిల్‌లో లేఆఫ్‌లు - Udayam
ఏఐ పెట్టుబడుల ఖర్చులను భర్తీ చేసుకునేందుకు ఒరాకిల్‌ ఈ నెలలో మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌ 1న రెండో త్రైమాసికం ప్రారంభానికి ముందే కోతలు అమలు చేయాలని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. డేటా సెంటర్లు, ఏఐ చిప్‌లపై ఒరాకిల్‌ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటికే గత 12 నెలల్లో 21వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు సంస్థ జూన్‌లో వెల్లడించింది.

Comments

G
Loading comments...