వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్‌లో వరద కాలువలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు సాయి వలకు గురువారం సుమారు 30 కిలోల బొచ్చె చేప చిక్కింది. భారీ చేప వలకు చిక్కడంతో ఇతర జాలర్లు అక్కడికి చేరుకున్నారు.
ఎల్లంపల్లి జలాలు వరద కాలువ ద్వారా మిడ్‌మానేరు చేరుతుండటంతో ప్రవాహం కొనసాగుతోంది. చేపతో కలిసి జాలర్లు ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

