Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలమండలిలో భారీ అవినీతి

Follow Udayam on Google
Ravi Gupta May 30, 2026 12:40 PM హైదరాబాద్General
జలమండలిలో భారీ అవినీతి - Udayam
హైదరాబాద్ జలమండలిలో క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అవినీతి దందా సాగుతోంది. ముఖ్యంగా ఎండాకాలంలో ట్యాంకర్లు, నీటి సరఫరాలో అక్రమాలకు పాల్పడుతూ అధికారులు, సిబ్బంది రూ.కోట్లు దండుకుంటున్నారు. అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్సుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. లైన్‌మెన్లను బినామీలుగా వాడుకుంటూ అధికారులు ఈ అక్రమాలకు తెరలేపుతున్నారు. ఏళ్లుగా ఒకే చోట తిష్టవేసిన సిబ్బంది అందినకాడికి దోచుకుంటున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...